Haleem | బేగంపేట్, ఫిబ్రవరి 27 : రేపట్నుంచి ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరవాసులకు సంప్రదాయ వంటకమైన హలీంను అందించేందుకు సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో హలీం ఫెస్టివల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. గురువారం ప్యారడైజ్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో హోటల్ సీఈఓ గౌతమ్ గుప్తా వివరాలు వెల్లడించారు. మటన్ అండ్ చికెన్ హలీం అందించనున్నట్లు తెలిపారు. వినియోగదారులకు డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పించినట్లు చెప్పారు. ఇక ఆలస్యం ఎందుకు.. నగరవాసులు రుచికరమైన హలీంను ఆరగించండి.