H City | నిధుల్లేక.. చేతులెత్తేశారు.. హెచ్ సిటీ ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలినీడలు..
H City | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్ సిటీ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎంతో ఆర్భాటంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పట్లో ముందడుగు పడే పరిస్థితులు కనబడటం లేదు.
భూ సేకరణకు నిధుల గండం
రూ. 760 కోట్ల నిధుల మంజూరుకు వినతి
ముందుకు కదలని భూసేకరణ, ప్రాజెక్టులు
H City | సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్ సిటీ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎంతో ఆర్భాటంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పట్లో ముందడుగు పడే పరిస్థితులు కనబడటం లేదు. ఇందుకు భూ సేకరణకు వెంటాడుతున్న కష్టాలే కారణమని చెప్పక తప్పదు. వాస్తవంగా ఫ్లై ఓవర్లు..ఆర్వోబీ..ఆర్‌యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ..లింకు రోడ్లు..అభివృద్ధి ఏదైనా సకాలంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే భూసేకరణ అత్యంత కీలకం. ఆయా ప్రాజెక్టు వ్యయం ఎంత ఖర్చు అవుతుందో..భూ సేకరణకు అంతే స్థాయిలో వ్యయం అవుతుంది. ఐతే ఆస్తుల సేకరణలో జీహెచ్ఎంసీ మొదటినుంచి లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నది. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభం సమయంలోనే దాదాపు ఆస్తుల స్వాధీనంలో పై చేయిగా ఉండాలి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ భూసేకరణపై స్పష్టత లేకుండానే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయడం అధికారుల పనితీరుకు నిదర్శనం. ఈ నేపథ్యంలోనే ఆస్తుల సేకరణకు రూ.760 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిన అధికారులు ఈ నిధుల మంజూరుకు సర్కార్ వైపు దీనంగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఖజానాలో నిధులు లేకపోవడం..ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తుండడం..వెరసి నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే గానీ ప్రాజెక్టులకు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.ప్రాజెక్టు విభాగం అధికారులు మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి టెండర్ల ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేస్తుండడం విశేషం.
కేబీఆర్ పార్కు చుట్టూ ..
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం రోజురోజుకు మరింత జఠిలంగా మారుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా తమ ఇంటి స్థలాలను కోల్పోతున్న వారి నుంచి తీవ్రమైన ప్రతిఘటన వ్యక్తం కావడం..న్యాయపరమైన చిక్కులు పెరుగుతుండడంతో.. ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కేబీఆర్ పార్కు ఫ్లై ఓవర్లు, అండర్ పాసుల నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భూసేకరణ నిలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర బడా పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన ఆస్తుల స్వాధీనం అధికారులకు తలనొప్పిగా మారుతుండగా.. వరుస కోర్టు వివాదాలతో భూసేకరణ ప్రక్రియను ఎలా పూర్తి చేయలేదని సమస్యగా మారుతోంది.
అభాసుపాలవుతున్న ప్రాజెక్టు..
హెచ్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా రూ. 7032 కోట్ల పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయగా..ఇందులో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారి విస్తరణ పనులు ఉన్నాయి. 38 ప్రాజెక్టులు ఉండగా 28 ఫ్లై ఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, నాలుగు ఆర్వోబీలు, మూడు ఆర్‌యూబీలు, పది చోట్ల రహదారి విస్తరణ పనులకుగానూ కొన్నింటికి టెండర్లు పిలిచారు. వచ్చే రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. ఐతే భూసేకరణలో భాగంగా నిర్వాసితులకు పరిహారం ముందుగా చెల్లించాల్సి ఉంది. ఐతే బీఆర్ఎస్ హయాంలో ఎస్ఆర్డీపీ ద్వారా 47 ప్రాజెక్టులు చేపట్టి 36 ఫ్లై ఓవర్లతో అనతికాలంలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను చేపట్టినప్పుడు నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ట్రాన్స్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) ద్వారా పరిహారం అందించారు. దాదాపు రూ.3700 కోట్ల పైచిలుకు టీడీఆర్ బాండ్స్ భూ నిర్వాసితులకు జీహెచ్ఎంసీ అందచేసింది. దీంతో రూ.3700 కోట్ల మేరకు భారీ మొత్తంలో వ్యయానికి సంబంధించిన భారం తప్పింది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ పరిహారానికి నిర్వాసితులు మొగ్గుచూపే పరిస్థితి లేదు. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలో టీడీఆర్‌లకు ససేమిరా అంటున్నారు.
హెచ్సిటీ ప్రాజెక్టుల్లో కీలకమైనవి..
- చందానగర్ నుంచి అమీన్పూర్ మీదుగా ఓఆర్ఆర్ అనుసంధానం చేస్తూ 2.7 కిలోమీటర్ల మేరలో రూ. 45 కోట్లతో 150 ఫీట్ల రహదారి విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది.
- జీడిమెట్ల ఫాక్స్ సాగర్ నాలా మీదుగా నాలుగు లేన్ల బ్రిడ్జిల నిర్మాణం రూ.56 కోట్లతో చేపట్టనున్నారు.
- ఐఐఐటీ జంక్షన్లలో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ అండ్ అండర్‌పాస్ నిర్మాణం రూ. 459 కోట్లతో 3.25 కిలోమీటర్ల మేరలో చేపడుతారు.
- ఖాజాగూడ జంక్షన్ వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ 1.52 కిలోమీటర్ల మేరలో రూ.220కోట్లతో చేపట్టనున్నారు.
- బంజారాహిల్స్ విరంచి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రూ.150కోట్లతో 100, 120 ఫీట్లతో రహదారుల విస్తరణ
- అజీంహోటల్ నుంచి చర్చి గేట్ వరకు (షోహిబ్ హోటల్ నుంచి బాలాపూర్ రోడ్ వరకు), చాంద్రాయణ గుట్ట క్రాస్ రోడ్ నుంచి బార్కాస్ రోడ్ వరకు వయా చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ రహదారి విస్తరణ
- బెంగుళూరు హైవే నుంచి శాస్త్రీపురం జంక్షన్ వదరకు 100 ఫీట్ల రోడ్ విస్తరణ
- ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్లో ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్, టీవీ 9 కార్యాలయం వద్ద అండర్ పాస్, చిలకలగూడ వద్ద ఆర్యూబీ
- కూకట్పల్లి వై జంక్షన్లో రెండు వైపులా 3 లేన్లతో ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులకు భూ సేకరణ చేపట్టాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Congress govt
- GHMC
- H City
- hmda
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

