డంపింగ్‌యార్డు తరలింపునకు ఐక్య ఉద్యమం
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు తరలింపునకు ఐక్య ఉద్యమం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారంలో మంగళవారం డంపింగ్‌యార్డు తరలింపుపై అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 3 : జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు తరలింపునకు ఐక్య ఉద్యమం చేయాలని
వక్తలు పిలుపునిచ్చారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారంలో మంగళవారం డంపింగ్‌యార్డు
తరలింపుపై అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం,
సీపీఐ నాయకులు మాట్లాడుతూ డంపింగ్‌యార్డు తరలింపునకు పార్టీలకతీతంగా ఏకం కావాల్సిన
అవసరం ఉందన్నారు.
అన్ని పార్టీలతో కలిపి కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తాదమన్నారు. అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో బీఆర్ఎస్లో ఉన్నా సమస్య మన అందరిదని అన్నారు. పక్కా ప్రణాళిక రూపొందించుకొని, ఆ దిశగా ఉద్యమిద్దామన్నారు. ప్రతి ఎమ్మెల్యేను, ఎంపీని, పార్టీల అధ్యక్షులను కలుస్తూ డంపింగ్ యార్డు ఈ ప్రాంత ప్రజలు కనువిప్పు కలిగేలా వివరిద్దామన్నారు. ఆ తర్వాత కూడా స్పందన లేకుంటే ఐక్యంగా ఉద్యమిద్దామని తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్, జవహర్ నగర్ మేయర్లు కావ్య, శాంతి కొటేశ్ గౌడ్, దమ్మాయిగూడ మాజీ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్‌లు అనురాధ యాదగిరి గౌడ్, శంకర్ గౌడ్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డివిజన్ అధ్యక్షులు శ్రీధర్, కొండల్ , శ్రీకాంత్ యాదవ్, స్వప్న విజయ్ రెడ్డి, రామారావు, మాజీ వైస్ చైర్మన్ మల్లేశ్, వివిధ పార్టీల నాయకులు సంజీవ రెడ్డి, సంపనబోలు హరి గౌడ్(నర్సింహ గౌడ్) శ్రీహరి గౌడ్, రమేశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, హరిబాబు, సురేశ్, జీవన్ రెడ్డి, సత్యం, రవి, సంతోష్, నర్సింగ్ రావు, శివన్నారాయణ, అశోక్, బాలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- CPM
- Dumping yard
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

