రియల్టర్ల కన్నెర్ర
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించి, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
- 20 ఫీట్ల నిబంధనపై ఎంఎంసీ ఆఫీసు ముట్టడి
- జీవో 168ను సవరించాలని డిమాండ్
- పేదలను సొంతింటి కలకు దూరం చేయొద్దు
- చిన్న ప్లాట్లకు నిర్మాణ అనుమతులివ్వాలని విజ్ఞప్తి
సిటీబ్యూరో/ రామంతాపూర్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం
ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించి, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ
చర్యలు తీసుకోవాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 1850 సైజు లోపు ఉన్న
ప్లాట్లకు, అలాగే చిన్న స్థలాల నిర్మాణ అనుమతులు, 22-ఏ భూముల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే
స్పందించాలని కోరింది.
మంగళవారం అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎంఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని, లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోందని టీఆర్ఏ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిన్న స్థలాలను కొనుగోలు చేసుకుంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు భవన నిర్మాణ అనుమతుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
100 గజాల లోపు స్థలాలు, 1850 అడుగుల పరిమాణంలో ఉన్న ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు పొందడం కష్టంగా మారుతోందని అన్నారు. పెద్ద స్థలాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని సామాన్య ప్రజలు, తమ జీవితకాల సంపాదనతో చిన్న స్థలాలు కొనుగోలు చేసి సొంతిల్లు నిర్మించుకోవాలనుకుంటే అనుమతులు రాక వారి ఆశలు ఆవిరవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ప్లాట్లకు సంబంధించి ప్రజలు ఎదురొంటున్న రిజిస్ట్రేషన్ సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిషరించాలని ప్రవీణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇల్లు కట్టుకునేందుకు ఎంతో మంది బిల్డింగ్ పర్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే జీవో 168 పేరు చెప్పి మున్సిపల్ అధికారులు దరఖాస్తులను రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు వెడల్పు 20 ఫీట్లు ఉంటేనే భవన నిర్మాణ పర్మిషన్ ఇస్తామని, అంతకంటే తకువ ఉంటే ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారని తెలిపారు. అయితే గతంలో 20 ఫీట్ల కంటే తకువ రోడ్డు వెడల్పు ఉన్న లక్షలాది ప్లాట్లను ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి ప్లాటుకు తప్పనిసరిగా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 168కి సవరణలు చేసి, చిన్న ప్లాట్లకు పర్మిషన్లు ఇచ్చి పేదలకు న్యాయం చేయాలని కోరారు.
టీఆర్ఏ ప్రధాన డిమాండ్లు..
ఆందోళన ఆనంతరం ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని రియల్టరందరూ కలిసి వినతి పత్రం
సమర్పించారు. ప్రభుత్వం చిన్న స్థలాల యజమానుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి, నిబంధనలకు
అనుగుణంగా భవ న నిర్మాణ అనుమతులు కల్పించేలా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని, రియల్టర్ల
సమస్యలను పరిషరించేందుకు ప్రభుత్వం, రియల్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరపాలని
కోరారు. 22-ఏ నిషేధిత భూముల సమస్యకు శాశ్వత పరిషారం చూపి, ప్రజలకు భూమిపై భద్రత ,
రిజిస్ట్రేషన్ హకులు కల్పించాలని సూచించారు.
‘స్థలం చిన్నదైనా… సొంతింటి కల మా త్రం చిన్నది కాదు’ నినాదంతో సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేసే లా ప్రభుత్వం వెంటనే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేయగా.. ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పగడాల రంగారావు, శ్రీకాంత్ రెడ్డి, అనిల్ కుమార్ , రాజుగౌడ్ , మల్లేశ్ గౌడ్ , సురేందర్ రెడ్డి , అభిలాశ్, వనజా, బొమ్మ వెంకటేశ్వ ర్లు, ప్రవీణ్ కుమార్ , శ్యాంరావు, సంజీవరావు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

