ప్రైవేట్ ట్యాంకర్ల యజమానుల ఆందోళన
గ్రేటర్ హైదరాబాద్లో ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం ప్రైవేట్ బోర్లను సీజ్ చేస్తుండటంతో నిరసనలకు పిలుపునిచ్చారు. మంగళవారం నీళ్లను రోడ్లపై పారబోస్తూ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు
ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం ప్రైవేట్ బోర్లను సీజ్ చేస్తుండటంతో నిరసనలకు పిలుపునిచ్చారు.
మంగళవారం నీళ్లను రోడ్లపై పారబోస్తూ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రెవెన్యూ, హైడ్రా
అధికారులు కొద్దిరోజులుగా అనుసరిస్తున్న విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్
ట్యాంకర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు.
తమ బోర్లను అక్రమ బోర్లుగా పేర్కొంటూ హైడ్రా అధికారులు తొలగిస్తున్నారని ఆరోపించారు. బోర్లను తొలగించడంతో నీటి సరఫరా నిలిచిపోయి జీవనోపాధి కోల్పోతున్నామని, దీంతో తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటున్నామని వాపోయారు. అధికారుల తీరుకు నిరసనగా మంగళవారం నుంచి ప్రైవేట్ ట్యాంకర్లు రోడ్డుపైకి రావొద్దని యజమానులకు సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు తీవ్రంగా పడిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పైవేట్ బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను నిషేధించింది. ఈమేరకు రెవెన్యూ, హైడ్రా అధికారులు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలకు వేలాది ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్లు నిత్యం సరఫరా అవుతున్నాయి. సిటీలో దాదాపుగా 1800 నుంచి 2000 ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నిత్యం నీటి సరఫరా జరుగుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

