పనిచేయని వెబ్సైట్.. నిలిచిన ఓటు నమోదు
పట్టభద్రుల ఓటు నమోదుకు ఆన్లైన్ ఆటంకం ఏర్పడింది. రెండు రోజులుగా వెబ్సైట్లు పనిచేయకపోవడంతో ఆన్లైన్ ఓటు నమోదుకు అవకాశం లేకుండా పోయింది.
మేడ్చల్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఓటు నమోదుకు ఆన్లైన్ ఆటంకం ఏర్పడింది. రెండు రోజులుగా వెబ్సైట్లు పనిచేయకపోవడంతో ఆన్లైన్ ఓటు నమోదుకు అవకాశం లేకుండా పోయింది.
వెబ్సైట్లు పనిచేయకపోవడంతో మరింత ఓటరు నమోదు శాతం తగ్గే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం
వ్యక్తమవుతుంది.
త్వరలో జరగనున్న మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ
ఎన్నికలకు ఓటు నమోదుకు ఎన్నికల సంఘం ఓటు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం
విధితమే. ఓటు నమోదు గడువు ఈ నెల 6 వరకు ముగియనున్న నేపథ్యంలో రెండు రోజులు వెబ్సైట్లు
పనిచేయకపోవడంతో ఓటు నమోదు పట్టభద్రులు దూరమయ్యారు.
మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉన్న క్రమంలో పట్టభద్రులు ఏ మేరకు ఓటు నమోదును
చేసుకుంటారన్నది వేచిచూడాల్సిందే. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షా35 వేల పట్టభద్రుల ఓటర్లు ఉండగా గత నెల 31 వరకు 86,882 ఓట్లు నమోదయ్యాయి. వెబ్సైట్లు ఓపెన్ కాకపోవడంతో ఓటరు నమోదు వివరాలు అధికారికంగా తెలియడం లేదు. మంగళవారం నాటికి 90 వేల పైచిలుకు ఓటు నమోదు జరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

