Hyderabad | రాయదుర్గంలో కాల్పుల కలకలం
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ భూ వివాదానికి సంబంధించి రాయదుర్గం పీఎస్ పరిధిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు.
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. మణికొండలోని పంచవటి కాలనీలో భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం.
స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని ప్రభాకర్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాల్లోకి ప్రభాకర్ మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులపై బాధిత వర్గం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

