
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా సినీ నటుడు తనుజ్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా తనుజ్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేసారని ఆయన అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటివద్ద వీలైనన్నీ మొక్కలు నాటాలని కోరారు.
అనంతరం హీరోయిన్ నైనా గంగూలీ, నిర్మాతలు తేజ ఉప్పలపాటి, రాజేందర్ రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.