Oppo Reno 16 | ఒప్పో నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్లో రెనో 16 సిరీస్ ఫోన్లు విడుదల.. కీలక ఫీచర్లు ఇవే
Oppo Reno 16 : చైనాకు చెందిన ఒప్పో సంస్థ నుంచి వచ్చే ఫోన్లలో రెనో సిరీస్ ఫోన్లు మంచి సక్సెస్ అయ్యాయి. ఈ సిరీస్‌లో ఇప్పుడు మరో రెండు కొత్త ఫోన్లను సంస్థ ఇండియాలోకి లాంఛ్ చేసింది. అవి ఒప్పో రెనో 16. రెనో 16సీ. ఇవి రెండూ ఫ్లాగ్షిప్ ఫోన్లు.
Oppo Reno 16 : చైనాకు చెందిన ఒప్పో సంస్థ నుంచి వచ్చే ఫోన్లలో రెనో సిరీస్ ఫోన్లు మంచి సక్సెస్ అయ్యాయి. ఈ సిరీస్‌లో ఇప్పుడు మరో రెండు కొత్త ఫోన్లను సంస్థ ఇండియాలోకి లాంఛ్ చేసింది. అవి ఒప్పో రెనో 16. రెనో 16సీ. ఇవి రెండూ ఫ్లాగ్షిప్ ఫోన్లు. వీటితోపాటు ఒప్పో బబుల్‌ను కూడా సంస్థ విడుదల చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరాతో కలిపి పనిచేసే మ్యాగ్నెటిక్ యాక్సెసరీ. వీటికి సంబంధించిన కీలక ఫీచర్లు, ధర వివరాలివి.
ఒప్పో రెనో 16 ఒప్పో రెనో 16
6.32 అంగుళాల ఫుల్ హెచ్డీ+అమోలెడ్ డిస్ప్లే, 3,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్ ఓఎస్, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7జన్ 4 ప్రాసెసర్, ట్రిపుల్ మెయిన్ కెమెరా (50ఎంపీ రేర్ కెమెరా+50ఎంపీ అల్ట్రావైడ్+50ఎంపీ టెలీఫొటో కెమెరా), 50ఎంపీ సెల్ఫీ కెమెరా, 6,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 193 గ్రాముల బరువు, ఐపీ 66+ఐపీ68+ఐపీ69+ఐపీ69కే రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.61,999/రూ.67,999.
ఒప్పో రెనో 16సీ
6.57 అంగుళాల ఫుల్ హెచ్డీ+అమోలెడ్ డిస్ప్లే, 1,400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్ ఓఎస్, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7,300 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్, ట్రిపుల్ రేర్ కెమెరా (50ఎంపీ మెయిన్ కెమెరా+8ఎంపీ అల్ట్రావైడ్+50ఎంపీ టెలీఫొటో కెమెరా), 50ఎంపీ సెల్ఫీ కెమెరా, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 197 గ్రాముల బరువు, ఐపీ 66+ఐపీ68+ఐపీ69+ఐపీ69కే రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.46,999/రూ.49,999/రూ.55,999.
వివిధ కార్డులపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ నెల 9 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తోపాటు ఒప్పో ఇండియా రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇవి స్టారీ వైట్, స్టెల్లార్ పర్పుల్, ట్విలైట్ వయొలెట్ రంగుల్లో లభిస్తుంది. వీటితోపాటు ఒప్పో బబుల్ అనే యాక్సెసరీని కూడా సంస్థ విడుదల చేసింది. ఇది ఒక మ్యాగ్నటిక్ స్టిక్కర్ వంటి డివైజ్. దీన్ని ఫోన్ వెనుక వైపు అతికించుకోవచ్చు. ఇది 1.73 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 560 ఏంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. దీని ధర రూ.7,999.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

