నగర రహదారులపై పర్యావరణహిత గ్రీన్ మెట్రో బస్సులు ఈ నెల 23 నుంచి పరుగులు పెట్టనున్నాయి.
తొలి విడత 25 ఎలక్ట్రిక్ గ్రీన్‌మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.