సిటీ బ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్వీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధి బృందం పేర్కొన్నది. తెలంగాణ భవన్లో గేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్వీ ప్రతినిధులు మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధుల సమస్యలు, సంస్థ బలోపేతానికి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్ ఇన్చార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డిని కలిసి సంస్థ కోసం చురుకుగా పనిచేసిన హైదరాబాద్ స్థానిక నాయకుడికి ఈసారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కల్వా నితీష్, షేర్ రమణ్, బత్తిని ప్రశాంత్ గౌడ్, రాహుల్, నవీన్, సాయికిరణ్, క్రాంతి, మనీషా, అక్షయ్పటేల్, హేమంత్‌రెడ్డి, నవీన్, రవి, రహ్మత్, రాజు, ఆసిఫ్‌లు పాల్గొన్నారు.