80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. పలుచోట్ల భారీ జాతీయజెండాలతో ర్యాలీలు నిర్వహించి భారత్‌మాతాకీ జై.. అంటూ నినాదాలు చేశారు. మహనీయుల త్యాగాలను కొనియాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, చిన్నారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మూడు రంగుల జెండాకు వందనం సమర్పించారు.

సలాం సైనిక పుస్తకావిష్కరణ
సిటీబ్యూరో/కంటోన్మెంట్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ) : అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘సలాం సైనిక’ పుస్తకాన్ని శనివారం పరేడ్ గ్రౌండ్లో సైనిక స్మారక స్థూపం వద్ద ఆవిష్కరించారు. అమర వీరులకు త్రివిధ దళాల గౌరవ వందన సమర్పన అనంతరం కల్నల్ సురేశ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అక్షరయాన్ కవయిత్రులు 21మంది పరమ వీర చక్ర పురసార గ్రహీతలపై మూడు భాషల్లో ఈ పుస్తకాన్ని రచించారు. వీరుల ధైర్యానికి నివాళులర్పించిన హృద్యమైన కవితా సంకలనంగా మేజర్ జనరల్ జీ.శ్రీనివాస్ అభివర్ణించారు. కార్యక్రమంలో అక్షరయాన్ సభ్యులు అయినంపూడి శ్రీలక్ష్మి, విశ్వైక తదితరులు పాల్గొన్నారు.

జవహర్‌నగర్, ఆగస్టు 15: దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల ఆశయాలతో ముందుకు సాగుదామని, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జవహర్‌నగర్‌లో సామాజిక నాయకుడు రాజేశ్ ఆధ్వర్యంలో 300మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మేయర్ మేకల కావ్య పాల్గొన్నారు. యువకులు సమాజంలో స్ఫూర్తినింపే కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కొండల్ ముదిరాజ్, జిట్టా శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌చారి, సంగీతారాజశేఖర్, పల్లపు రవి, భార్గవ్, బాల్‌రాజ్, ప్రసాద్, వెంకటేశ్, నవీన్‌గౌడ్, మహేశ్, ఆహ్మద్‌పాషా, దిలీప్, భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.