శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 24, 2020 , 08:58:48

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి

మేడ్చల్ : మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం, ఓయూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు ఓటరు నమోదు ప్రతులను శుక్రవారం మర్రి రాజశేఖర్‌రెడ్డికి బోయిన్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి అందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎన్నికలను టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నదని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం శ్రేణులు కృషి చేయాలన్నారు.

‘కార్మికులకు న్యాయం చేయాలి’ 

సరూర్‌నగర్‌కు చెందిన స్టాల్‌ ట్రేడర్స్‌ కంపెనీ యాజమాన్యం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తొలగించిన కార్మికులకు న్యాయం చేయాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఉద్యోగం కోల్పోయిన కార్మికులు రాజశేఖర్‌రెడ్డిని బోయిన్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నాయకులు మహేశ్‌, ప్రభాకర్‌, శ్రవణ్‌ పాల్గొన్నారు.