శేరిలింగంపల్లి : అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో రూ. 4 కోట్ల రూపాయాల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు.
అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని సకాలంలో నాణ్యతతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు కోరారు. సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హుడా కాలనీలో గత కొన్నేండ్లుగా ఎదుర్కుంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చేకూరిందన్నారు.
దాదాపు ప్రారంభించిన అన్ని పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. అనంతరం నల్లగండ్లలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, అనిల్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.