రేషన్‌షాపుల్లో మినీ గ్యాస్ సిలిండర్లు
రేషన్ దుకాణాల్లో మినీ వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన వారికి వేగంగా, సునాయసంగా సిలిండర్లు అందించనున్నారు. నగరంలో మొదటగా ఒక్కో సర్కిల్లో 10 రేషన్ దుకాణాల నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా
త్వరలో 90 దుకాణాల్లో అమ్మకాలు
పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
విజయవంతమైతే మరిన్ని దుకాణాల్లో విక్రయాలు
2,5 కేజీల్లో సిలిండర్లు లభ్యం
సిటీబ్యూరో, మార్చి 29 : రేషన్ దుకాణాల్లో మినీ వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన వారికి వేగంగా, సునాయసంగా సిలిండర్లు అందించనున్నారు. నగరంలో మొదటగా ఒక్కో సర్కిల్లో 10 రేషన్ దుకాణాల నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా మినీ సిలిండర్ విక్రయాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సివిల్ సైప్లె కార్యాలయం నుంచి సర్కిళ్ల వారీగా రేషన్ దుకాణాల జాబితాను సంబంధిత ఆయిల్ కంపెనీలకు పంపించారు. నగరంలో 9 సర్కిళ్ల పరిధిలో 670 రేషన్ దుకాణాలు ఉండగా.. ముందుగా 90 దుకాణాల్లో సిలిండర్ల విక్రయాలు ప్రారంభించి, ఆ తరువాత అన్ని దుకాణాలకు విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
గ్యాస్ ఏజెన్సీల నుంచే..
స్థానికంగా ఉండే గ్యాస్ ఏజెన్సీల నుంచే రేషన్ దుకాణాలకు మినీ సిలిండర్లు సరఫరా అవుతాయి. ఏజెన్సీ, రేషన్ దుకాణాల మధ్య ఉండే ఒప్పందాల మేరకు 5 నుంచి 10 సిలిండర్లు నిత్యం రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటారు. సిలిండర్లపై కమీషన్లు కూడా గ్యాస్ ఏజెన్సీల నుంచే అందుతాయి. ఇందులో 2 కిలోలు, 5 కిలోల సిలిండర్లు ఉంటాయని అవసరమైన వారు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్లి ఎలాంటి గుర్తింపుకార్డు లేకుండానే సిలిండర్ తీసుకోవచ్చని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రమేశ్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Cylinder
- domestic gas
- gas
- LPG
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

