బ్లాక్ కాట్ కార్ ర్యాలీని ప్రారంభించిన గవర్నర్

సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవ్‌లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) ఆధ్వర్యం లో సుదర్శన్ భారత్ పరిక్రమ కార్యక్రమం ద్వారా 7,500 కిలోమీటర్ల ‘బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ’ని నిర్వహించేందుకు సంకల్పించారు. పీవీ నరసింహారావు మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ముఖ్య అతిథిగా ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ సార్వ భౌమత్వ రక్షణలో ఎన్ఎస్జీ కమాండోల పాత్ర కీలకమన్నారు. యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్లతో ఉగ్ర మూకలను తుద ముట్టిస్తూ శాంతి భద్రతలను నెలకొల్పుతున్న కమాండోల సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం, దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ – 2019 బ్యాచ్ ట్రైనీల బృందం, ఎస్ఐసీఏ అధ్యక్షుడు ఎస్.చక్రవర్తి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. అలాగే.. ఎన్ఎంసీ సభ్యుడు, నిమ్స్ మాజీ డీన్ జి.సూర్యనారాయణ రాజును గవర్నర్ సన్మానించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

