హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకొస్తాస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్‌పేట్‌లోని 50 పడకల హాస్పిటల్లో రూ.74 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మినీ డయాగ్న స్టిక్ సెంటర్‌ను ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరీక్షల కోసం పేద ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మినీ డయోగ్న స్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వేలాది రూపాయల విలువైన పరీక్షలను ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా చేస్తారని మంత్రి తెలిపారు. అలాగే ఆహారం కోసం రోగి బంధువులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు 5 రూపాయలకే భోజన సౌకర్యం సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. నగరంలోని 18 ప్రధాన హాస్పిటల్స్ లో 5 రూపాయల భోజన కేంద్రాలు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారలు ఉన్నారు.