Development of dargas | చారిత్రక దర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణలో చారిత్రక పహాడీషరీఫ్ బాబా షర్ఫుద్దీన్ దర్గాను కులమతాలకు అతీతంగా భక్తులు దర్శించుకుంటారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
పహాడీషరీఫ్ : తెలంగాణలో చారిత్రక పహాడీషరీఫ్ బాబా షర్ఫుద్దీన్ దర్గాను కులమతాలకు అతీతంగా భక్తులు దర్శించుకుంటారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం ఆయన పహాడీషరీఫ్ దర్గాకు విచ్చేసి అధికారులతో కలిసి ర్యాంపు పనులను పరిశీలించి సమీంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన పహాడీషరీఫ్ దర్గా కులమతాలకు అతీతంగా దర్శించుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. దర్గాపైకి ఎక్కడానికి ఎదురవుతున్నఇబ్బందులను దృష్టిలో పెటుకుని ర్యాంపు ఏర్పాటు కోసం గత మూడు సంవత్సరాల క్రితం రూ. 9 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు.
కరోనా కారణంగా పనులు ఆగిపోయాయన్నారు. ప్రస్తుతం పనులు కొనసాగడానికి మరో రూ. 6 కోట్లు ప్రభుత్వం కేటాయించింద న్నారు. రెండు విడతల్లో ర్యాంపు పనులు, పార్కు అభివృద్ధి, ఆర్చ్, రెస్ట్ రూమ్స్ పూర్తి చేయిస్తామన్నారు. కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్ అహ్మద్, మైనార్టీ అడ్వైజర్ ఎ.కె. ఖాన్, వక్ఫ్ బోర్డు సీఈఓ షహన్వాజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, దర్గా కమిటీ సభ్యులు మోయినోద్దీన్, ఇమ్రాన్, సలీం,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

