కందుకూరు : అన్ని కులాల వారికి అండగా ఉంటానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని దళిత సంఘం నాయకులు మంగళవారం మంత్రిని కలిసి మండల కేంద్రంలో స్థలం కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కులాలు, మతాలకు అతీతంగా అందరికీ అండగా ఉంటానని చెప్పారు.
ప్రతి కూలానికి మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం కేటాయిస్తానని చెప్పారు. ఏ సమస్యలు ఉన్నా దళితులతో పాటు ప్రతి ఒక్కరూ తన దృష్టికి తీసుకరావాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో నియోజవర్గం టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు చిర సాయిలు, మండల అధ్యక్షుడు గుయ్యని సామయ్య, సర్పంచ్లు పరంజ్యోతి, శ్రీనివాస్, మంద సాయిలు, ఎంపీటీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ, దేవేందర్, మాజీ జడ్పీటీసీ పెద్ద రామయ్య, మాజీ సర్పంచ్ మస్కు బాబు, ఎంపీటీసీ సురేష్, డైరెక్టరు పొట్టి ఆనంద్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీపాల్గొన్నారు.