e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home హైదరాబాద్‌ అభాగ్యులకు అండగా..

అభాగ్యులకు అండగా..

అభాగ్యులకు అండగా..
  • ‘గుడ్‌ సమరిటన్స్‌ ఇండియా’
  • కాల్‌ చేస్తే చాలు.. సేవల్లో నిమగ్నం
  • కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు సైతం నిర్వహణ
  • అంబులెన్స్‌ సేవలూ అందుబాటులో..
  • సహాయం కావాలంటే డయల్‌ 9502836586, 040-27940981

ఆకలితో అలమటించే వారికి అన్నం పెడుతూ.. ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తూ.. దిక్కులేని వారికి నిలువనీడ కల్పిస్తూ… ఆపత్కాలంలో అన్నార్తులకు మేమున్నామంటూ భరోసానిస్తున్నది గుడ్‌ సమరిటన్స్‌ ఇండియా’. అయినవాళ్లు ముందుకు రాని వేళ.. కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు సైతం నిర్వహిస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్నది. సంస్థ ఫౌండర్‌ ఏఐ జార్జ్‌ రాకేశ్‌ బాబు, కో ఫౌండర్‌ సునీత జార్జ్‌, యేసుకల ఆధ్వర్యంలో సభ్యుల బృందం ఈ సేవలు కొనసాగిస్తున్నది. సమయం ఏదైనా.. కాల్‌ చేస్తే చాలు.. అభ్యాగులకు తోడుగా నిలుస్తున్నది.

కాల్‌ చేస్తే చాలు..

  • హైదరాబాద్‌ వేదికగా విభిన్న రకాల సేవలందిస్తున్నది ‘గుడ్‌ సమరిటన్స్‌ ఇండియా’. ఎక్కడ సాయం కావాల్సి వస్తే.. అక్కడ వాలిపోయి.. దాతృత్వాన్ని చాటుకుంటున్నారు
  • ఈ సంస్థ సభ్యులు. కరోనా క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరూ అండగా నిలిస్తేనే.. సమస్యల నుంచి బయటపడగలని పిలుపునిస్తున్నారు.
  • లాక్‌డౌన్‌లో ఇప్పటి వరకు 2 వేల కుటుంబాలకు రేషన్‌ కిట్స్‌ అందించగా, 150 మంది వలస కార్మికులకు షెల్టర్‌ సమకూర్చారు.
  • ప్రతి రోజూ 2వందల మందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
  • అంతేకాదు ఎమర్జెన్సీ సమయాల్లో అంబులెన్స్‌ సేవలు కూడా ఈ సంస్థ చేపట్టింది.
  • వీటితో పాటు కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
  • 20 మంది సభ్యులు వైరస్‌ సమాచారాన్ని వివరిస్తున్నారు.
  • వ్యాధితో మానసిక సమస్యలకు గురవుతున్న వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.
  • ఆస్పత్రుల బెడ్ల ఖాళీల వివరాలు, రక్తం, ప్లాస్మా లభించే మార్గాలను ప్రజలకు తెలియజేస్తున్నారు.
  • ఆపదలో ఉన్న వారు 9502836586, 040-27940981కు ఫోన్‌ చేస్తే .. ఈ సంస్థ సభ్యులు అందుబాటులోకి వస్తారు. http://www.goodsamaritansindia.in/contact-us.html వెబ్‌సైట్‌లోనూ సంప్రదించవచ్చు.

అన్నీ తామై.. అంత్యక్రియలు..

  • కొవిడ్‌ భయాందోళనల కారణంగా ఎవరైనా మృతిచెందితే బంధువులు సైతం అంత్యక్రియులు నిర్వహించేందుకు ముందుకు రాని దుస్థితి నెలకొన్నది.
  • అలాంటి మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్నదీ సంస్థ.
  • ఇప్పటి వరకు కొవిడ్‌తో చనిపోయిన 40 మందికి దహన సంస్కారాలు నిర్వహించారు.

కొవిడ్‌ బాధితులకు అండగా నిలుద్దాం

కొవిడ్‌ రోగులకు అనేక రకాల సేవలు అవసరం పడుతున్నాయి. నిర్ణీత సమయంలో వారికి సేవలందకపోతే చాలా ప్రమాదం. అందుకే మా బాధ్యతగా వారికి సహాయం అందిస్తున్నాం. మా సంస్థ తరఫున ఆహారం, అంబులెన్స్‌, రేషన్‌కిట్స్‌, మాస్క్‌, శానిటైజర్లు పంపిణీ చేశాం. కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు సైతం నిర్వహించాం. కష్టాల్లో ఉన్నవారు వివరాలు తెలియజేస్తే మేం వారికి అండగా నిలుస్తాం. సమయంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ మా సేవలు కొనసాగుతాయి. 2011 నుంచి మా సంస్థ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైంది. మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. -ఏ.ఐ. జార్జ్‌ రాకేశ్‌ బాబు. ఫౌండర్‌, గుడ్‌ సమరిటన్స్‌ ఇండియా.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభాగ్యులకు అండగా..
అభాగ్యులకు అండగా..
అభాగ్యులకు అండగా..

ట్రెండింగ్‌

Advertisement