మాదన్నపేట, జూలై 19: మాదన్నపేట శ్రీశ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ తంగెళ్ల సుధీర్ ఝాన్సీ దంపతులు రెండు జతల బంగారు పుస్తెలను బహుకరించారు. బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బండారు పుస్తెలతో అమ్మవారిని అలంకరించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు బొమ్మరి మహేష్,శ్రీకాంత్,ఉగాది మహేష్,రవికాంత్,బాలగౌని మల్హోత్రా గౌడ్,రేగు అనిల్ తదితరులు పాల్గొన్నారు.