Tolichowli ACP | మెహదీపట్నం మే 19 : హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చారిత్రాత్మక గోల్కొండ కోట ప్రాంతంలో ఉన్న ఏసీపీ డివిజన్ పేరును మార్చారు. గోల్కొండ ఏసీపీ డివిజన్‌ను టోలిచౌకి డివిజన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు రెండు పోలీసు స్టేషన్లతో కలిపి గోల్కొండ ఏసీపీ డివిజన్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ డివిజన్‌ను టోలిచౌకి డివిజన్‌గా మార్పు చేశారు. ఈ డివిజన్ పరిధిలో టోలిచౌకి, లంగర్‌హౌస్, గోల్కొండ పోలీస్ స్టేషన్లను చేర్చారు. ప్రజలకు శాంతి భద్రతల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ తెలిపారు.