వైభవంగా గోదాదేవి కల్యాణం
ఘట్కేసర్ మండలం, ఎదులాబాద్లోని శ్రీగోదా సమేత శ్రీమన్నారు రంగనాయక స్వామి కల్యాణ వేడుకలు సోమవారం అంగరంగవైభంగా జరిగాయి. ఎదులాబాద్ గ్రామంలో స్వయంభుగా వెలసి భక్తుల కొంగుబంగారం గా నిలిచిన శ్రీగోదాదేవి కల్యాణ వేడుకలను వందలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు.
- పట్టువస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి దంపతులు
- పెద్ద ఎత్తున హాజరైన భక్తులు
- గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం
ఘట్కేసర్ రూరల్, జనవరి 16 : ఘట్కేసర్ మండలం, ఎదులాబాద్లోని శ్రీగోదా సమేత శ్రీమన్నారు రంగనాయక స్వామి కల్యాణ వేడుకలు సోమవారం అంగరంగవైభంగా జరిగాయి. ఎదులాబాద్ గ్రామంలో స్వయంభుగా వెలసి భక్తుల కొంగుబంగారం గా నిలిచిన శ్రీగోదాదేవి కల్యాణ వేడుకలను వందలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని కల్యాణాన్ని వీక్షించి తరించారు. స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కల్పనారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు.
ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి కల్యాణంలో భాగంగా వేదపండితులు విశ్వకసేన ఆరాధన, పుణ్యహ వాచనం, రక్షాబంధన, జిలకర బెల్లం గురించి భక్తులకు వివరించారు. గోవింద నా మస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ సురేశ్, మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు లక్ష్మణాచార్చులు, గోవిందాచార్యులు, శేషాచార్యులు, పురుషోత్త మాచార్యులు, సేనామాచార్యులు, రఘునాథచార్యులు, వరప్రసాదాచార్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

