Kondapur | కొండాపూర్, మే 29 : నివాసాల మధ్య మేకలను పెంచుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని హుడా ఫేజ్ -2 కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చందానగర్‌లోని సంకల్ప్ ఫౌండేషన్ నిర్వాహకులు మేకలను పెంచుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవటం లేదంటున్నారు. నివాసాల మధ్య మేకల మందలు ఉండటంతో కంపు వాసన వస్తుందని, సంకల్ప్ ఫౌండేషన్ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని తమ ఇష్టానుసారంగా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి మేకల మందను ఇక్కడి నుంచి తొలగించేసేలా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.