Guru nanak jayanti | ఘనంగా శ్రీ గురునానక్ దేవ్‌జీ మహారాజ్ జయంతి ఉత్సవాలు

సుల్తాన్‌బజార్ : సిక్కుల మత గురువు శ్రీ గురునానక్ దేవ్‌జీ మహారాజ్ జయంతి ఉత్సవ వేడుకలని బుధవారం అఫ్జల్‌గంజ్ అశోక్బజార్లోని గురుద్వారా గురుసింగ్ సాహెబాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా ఉత్సవ కమిటి ప్రతినిధులు సర్దార్ సురేందర్ సింగ్, సర్దార్ జోగిందర్ సింగ్ ముజ్రాల్, దిల్ బార్ సింగ్ చావుడాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన నగర కీర్తన్ ర్యాలీ కన్నుల పండువగా నిర్వహించారు. ఈ ర్యాలీ అఫ్జల్‌గంజ్ గురుద్వారా గురు సింగ్ సాహెబా నుండి ప్రారంభమై అఫ్జల్‌గంజ్, సిద్దంబర్ బజార్, మోజాంజాహి మార్కెట్, జాంబాగ్, పుత్లీబౌలి, గౌలి గూడ సెంట్రల్ గురుద్వారాల మీదుగా కొనసాగి తిరిగి అశోక్బజార్లోని గురుద్వా రా గురుసింగ్ సాహెబాకు చేరుకుంది.

ఈ ర్యాలీలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహెబ్‌ను వివధ రకాల పూలతో ప్రతేక్యంగా అలకరించిన వాహనంలో ఏర్పాటు చేయడం దారి పొడవునా సిక్కుల సాంప్రదాయమైన కరసాము,కత్తి విన్యాసాలు,గట్కా వంటి విన్యాసాలు ప్రధాన ఆకర్శణగా నిలిచాయి.
ఈ ర్యాలీలో సిక్కు మత పెద్దలు,ఆధ్యాత్మిక వేత్తలు,సిక్కు సోద రులు పెద్ధ ఎత్తున పాల్గొన్నారు.ఈ సంధర్భ ంగా మహిళలు దారి పొడవునా ముగ్గులు వేస్తూ ర్యాలీని స్వాగ తించారు.అంతేకాకుండా కీర్తనలు పాడుతూ ర్యాలీ ఆసాంతం సాగింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

