వెంగళరావునగర్: భర్తకు తెలియకుండా గుట్టుగా ప్రియుడితో సరసాలాడి చిక్కుల్లో పడింది ఓ మహిళ. సురారం ప్రాంతానికి చెందిన ఓ గృహిణి (25) కూకట్ పల్లిలోని ఓ కాస్మోటిక్ క్లినిక్ లో లేజర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నది. అక్కడే అన్వేశ్ అనే వ్యక్తి థెరఫిస్ట్ గా పనిచేసేవాడు. ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఆమె ప్రేమ పొందేందుకు చేతిని సైతం కోసుకున్నాడు. దీంతో తనపై అంత ప్రేమ చూపించే అన్వేశ్ ప్రేమను అంగీకరించింది. పళ్లు భర్త ఉన్నప్పటికీ చాటుమాటుగా ప్రియుడితో సరసాలాడేది.
ఓ రోజు ప్రియుడి జేబులో గంజాయి ప్యాకెట్ ను చూసింది. వెంటనే అతడి చెల్లికి గంజాయికు అలవాటుపడ్డాడని చెప్పింది. ఆ విషయం తెలిసి కుటుంబంలో చెడ్డవాడిగా ముద్ర వేశారని, ఉద్యోగం పోవడానికి కారణమైందని ప్రియురాలిపై కక్షగట్టాడు. దీంతో తనతో కలిసి దిగిన ఫొటోలు.. వీడియోలను ‘నీ భర్తకు పంపుతా’నని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు.ప్రియురాలికి ఆడియో మెసేజ్ పంపాడు. చాటుమాటుగా చేసిన తన గుట్టంతా బయటపడితే కాపురం పోతుందని భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.