ఖైరతాబాద్, నవంబర్ 4: ‘యాభయ్యేండ్లలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిందేమి లేదు. పైగా ఆదివాసీలు, గిరిజనులకు మధ్య చిచ్చుపెట్టి దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమమే పట్ట దు. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓట్లేసేది లే దు’ అని గిరిజన విద్యార్థి సంఘం, విద్యార్థి సం ఘం నేతలు స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ ఉంటుందని ప్రకటించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బంజారా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. గడిచిన పదేండ్లలో గిరిజనుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారన్నారు. ప్రధానంగా గిరిజనుల చిరకాల కోర్కె అయిన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారన్నారు.
కేవలం ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లు పది శాతానికి పెంచారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పదవుల కోసం కొట్లాటలు తప్ప గిరిజనుల గోడు ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెయ్యి రూపాయలు, మందు బాటిల్ ఇస్తే ఓట్లు వేస్తారంటూ వ్యాఖ్యానించడం ఆయన అగ్రవర్ణ అహంకారానికి నిదర్శనమన్నారు. టికెట్ల విషయంలోనూ ఆదివాసీల ప్రాబల్యం ఉన్న చోట గిరిజనులకు, ఆ వర్గాలు అధికంగా ఉన్న చోట ఆదివాసీలకు టికెట్లు ఇచ్చి తమలో తమకు పంచాయతీలు పెట్టే కుట్ర చేశారన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క గిరిజనుడి ఓటు కూడా కాంగ్రెస్‌కు పడదన్నారు. ఢిల్లీ ప్రభుత్వాల వల్ల గిరిజనులకు ఒరిగేదేమి ఉండదని, న్యాయం జరుగదని, బీఆర్ఎస్తోనే తమ జాతి అభివృద్ధి జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ పాలనలో గిరిజనుల భూములను దాడులు, దౌర్జన్యాలతో గుంజుకుంటే, కాని రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల హక్కు పత్రాలు అందజేసి తమ గుండెల్లో నిలిచిపోయారన్నారు. మరో సారి బీఆర్ఎస్ను గెలిపించుకోవడం ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా సోషల్ మీడియాతో పాటు ప్రతి తండా, గూడే లు, గ్రామాలలో తిరిగి ప్రచారం చేస్తామని, రా ష్ట్రంలోని గిరిజనులంతా బీఆర్ఎస్కే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గిరిజన వి ద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు ఇందల్ రాథో డ్, ప్రధాన కార్యదర్శి రోహిత్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ నాయక్, ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ పాల్గొన్నారు.