సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీకు కొత్తగా 200 మంది జూనియర్ అసిస్టెంట్లను నియమించనున్నారు. ఈ మేరకు సోమవారం 100 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తవ్వగా, మిగిలిన 100 మంది వెరిఫికేషన్ మంగళవారం పూర్తి కానున్నది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంలో వీరికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.