Shankar Mutt | అంబర్‌పేట: శంకరమఠం కూరగాయల మార్కెట్లో రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం కూరగాయల దుకాణాలను జేసీబీలను పెట్టి తొలగించారు. 80 ఏండ్ల కింద ఏర్పాటైన ఈ కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా తొలగించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ బతుకులను రోడ్డు పాలు చేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
శేరిలింగంపల్లి: నానక్‌రాంగూడ ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపుతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ.. సుమారు 100 మంది వీధి వ్యాపారులు స్థానిక కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి అధ్వర్యంలో శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో డీసీ ముకుంద్రెడ్డిని కలిశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని, తమకు ప్రత్యామ్నాయం కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.