హైదరాబాద్ : చారిత్రాత్మక షేక్‌పేట సరాయి పునరుద్ధరణ పనులు చేపట్టాలని, మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని సంఘమిత్ర మాలిక్ అనే నెటిజన్ ట్వీట్ చేస్తూ పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ట్యాగ్ చేశారు. షేక్‌పేట సరాయి మరమ్మతుల అంశాన్ని పరిశీలిస్తామని, చారిత్రాత్మక నాంపల్లి సరాయి పునరుద్ధరణను ఇప్పటికే జీహెచ్ఎంసీ చేపట్టిందని అరవింద్ కుమార్ రీట్వీట్ చేశారు.
అరవింద్ కుమార్ తన ప్రత్యేక చొరవతో మొజాం జాహీ మార్కెట్‌తో పాటు పలు చారిత్రాక కట్టడాలను అభివృద్ధి చేసిన విషయం విదితమే. ఈ ఏడాది మార్చిలో సర్దార్ మహల్‌తో పాటు నాంపల్లి సరాయిని పరిశీలించిన అరవింద్ కుమార్.. వాటి పునరుద్ధరణ చేపడుతామని ప్రకటించారు. అందుకనుగుణంగా మరమ్మతులు చేపట్టారు.
We are taking up restoration of Nampally sarai with @GHMCOnline
— Arvind Kumar (@arvindkumar_ias) September 2, 2021
Will also look into restoration of sheikhpet sarai https://t.co/mdOoHXAnsP