మల్లాపూర్, జనవరి 6 : నాచారం పోలిస్టేషన్ పరిధి మల్లాపూర్‌లో సోమవారం జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం అదుపు తప్పింది. వాహనాన్ని రోడ్డుపై ఆపి డ్రైవర్ కిందికి దిగాడు.
ఈ క్రమంలో అదుపు తప్పిన వాహనం రోడ్డు దాటి పక్కన వున్న బైక్‌లు వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో వాహనాన్ని ఆపే ప్రయత్నంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు బైక్‌లు కారు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.