సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ ) : ఆస్తిపన్ను సేవలను జీహెచ్ఎంసీ మరింత సులభతరం చేసింది. ముఖ్యంగా ఆస్తిపన్ను, స్వీయ అంచనా, ఆస్తిపన్ను సవరణ, మొబైల్ నంబరు మార్పులు, డోర్ నంబర్ సవరణ, యాజమాని పేరు మార్పిడి మొదలైన సేవలకు ఇక మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇంటి నుంచే ఆన్లైన్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. దరఖాస్తుదారుడు తన ఇంటి పీటీఐఎన్ నంబరు, సెల్ డీడ్ అతను పొందాలనుకున్న సేవలకు సంబంధించిన ఇతర అవసరమైన సహాయక పత్రాల ద్వారా WWW.GHMC.GOV.IN ద్వారా ఆన్లైన్లో సేవలను పొందవచ్చని కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.
దరఖాస్తుదారుడు సంబంధిత పత్రాలతో ఆన్లైన్లో నేరుగా రెవెన్యూ శాఖకు వెళ్లవచ్చని, వాటి పరిశీలన తర్వాత ఆమోదం ఇవ్వబడుతుందన్నారు. ఆస్తిపన్ను మ్యుటేషన్ సేవలు పురోగతి దశలో ఉన్నాయని, ఈ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.