సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : పౌరులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు ఆయా శాఖల క్షేత్రస్థాయి అధికారుల సమన్వయంతో ‘ మల్టీ డిసిప్లీనరీ బృందాలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఆరు జోన్ల పరిధిలో 5వేలకు పైగా బృందాలను ఏర్పాటు చేస్తూ ‘వార్డు ఆఫీసర్’గా క్షేత్రస్థాయిలో సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని మెట్రో నగరాల్లో పురపాలక శాఖ సేవలు, ఫీల్డ్ లెవల్ మెకానిజానికి సంబంధించి అత్యుత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐదు మెట్రో నగరాల్లో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో ఐదు టీమ్లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పర్యటనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జోనల్ కమిషనర్ నేతృత్వంలో ఈ బృందాలు ఈ నెల 25, 26 తేదీల్లో న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో పర్యటించనున్నాయి. ఈ అధ్యయనానికి సంబంధించిన పర్యటనకు అయ్యే ఖర్చు జీహెచ్ఎంసీ భరించనుంది. ఈ బృందాలు రెండు రోజుల పాటు పర్యటించి సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఈ నెల 30వ తేదీలోగా అధ్యయన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
అధికారులు పర్యటించబోతున్న