సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం అమలుకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది (రెగ్యులర్, ఔట్ సోర్సింగ్) ముఖాన్ని సంబంధిత మొబైల్ బేస్డ్ యాప్‌లో ఐటీ విభాగం అధికారులు క్యాప్చర్ చేసి ..నమోదు చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పనిచేస్తుంది. 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నారు.
అందులో భాగంగానే శుక్రవారం అడ్వర్టయిజ్మెంట్ అండ్ పబ్లిసిటీ, ఆడిట్/అకౌంట్స్ సెక్షన్, సీపీఆర్వో సెక్షన్, ఎలక్షన్ బ్రాంచ్, ఎస్టేట్ ఆఫీస్, ఫైనాన్స్ అకౌంట్స్ సెక్షన్, జనరల్ టాక్సేషన్, లేబర్ వెల్ఫేర్ సెక్షన్, ల్యాండ్ ఎక్విజేషన్, లీగల్ సెక్షన్ అండ్ మున్సిపల్ కోర్టు, సెక్రటరీ సెక్షన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కమిషనర్ ఆఫీస్, వెటర్నరీ, విజిలెన్స్ సెక్షన్ల అధికారులు, సిబ్బంది ముఖాన్ని క్యాప్చర్ చేసినట్లు అధికారులు చెప్పారు.
శనివారం ఇంజినీరింగ్ విభాగం, ఐటీ, జేఎన్ఎన్యూఆర్ఎం, ఎస్ఎన్డీపీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇతర విభాగాల అధికారులు, సిబ్బందికి ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సోమవారం 23న మిగతా విభాగాల వారీగా ఫొటో క్యాప్చర్ చేయనున్నట్లు పేర్కొన్నారు. చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ అండ్ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్, హెల్త్ సెక్షన్, ఫుడ్ సేఫ్టీ వింగ్, హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీస్, లైసెన్స్ సెక్షన్, ప్రివెన్షన్ ఆఫ్ మలేరియా,యాంటీ మసిటో సీం , స్పోర్ట్స్, టౌన్ ప్లానింగ్, ట్రాన్స్పోర్ట్, అర్బన్ బయోడైవర్సిటీ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగాల అధికారులు, సిబ్బంది హాజరుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంలో నమోదు చేస్తామన్నారు.
ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానంతో పారదర్శకంగా, కచ్చితత్వంతో కూడిన హాజరు నమోదవుతుందన్నారు.