సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు కూకట్పల్లి ఉడిపి గ్రాండ్, కాప్రా స్వాగత్ గ్రాండ్, ఈ గ్యాలరియా, కోఠి ఉడిపి టిఫిన్స్, సంతోష్ బంజారా రెస్టారెంట్, మినర్వా గ్రాండ్, సైనీ దాబా, అంబర్పేట గ్రిల్ రెస్టారెంట్ల్లో తనిఖీలు చేపట్టారు.
పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు తేల్చారు. సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.