Food Safety | సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యతాప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఫుడ్సేఫ్టీ అధికారులు గురువారం మూసాపేట కృతుంగ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో బొద్దింకలను గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో వంటగది ఉన్నదని, ఆహార ప్యాకెట్లకు లేబుళ్లు సరిగా లేవని తేల్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని గుర్తించి చర్యలు తీసుకున్నారు.