సిటీబ్యూరో: అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మరింత మెరుగ్గా పని చేస్తూ భవన నిర్మాణ అనుమతులు వేగంగా మంజూరు చేయాలని చెప్పారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్‌తో కలిసి టౌన్ ప్లానింగ్ విభాగం కార్యకలాపాలను జోనల్లు, సరిల్ల వారీగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం సమీక్షించారు. భవన అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, కోర్టు కేసులు, ప్రజా ఫిర్యాదులు, లే అవుట్ రెగ్యులరైజేషన్ సీం దరఖాస్తులను త్వరితగతిన పరిషరించాలని కమిషనర్ ఆదేశించారు.