ఖాళీ కుర్చీలు.. కదలని ఫైళ్లు
గ్రేటర్‌ను అభివృద్ధి పథకంలో నడిపించాల్సిన జీహెచ్ఎంసీలో ఇప్పుడు యజమాని లేని ఇల్లు అన్న చందంగా తయారైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ సెలవుపై వెళ్లడమే ఆలస్యం.. కింది స్థాయి అధికారుల నుంచి విభాగాధిపతుల వరకు అందరూ ఆయా రామ్.. గయా రామ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
- సెలవులో బల్దియా కమిషనర్
- ఇష్టారాజ్యంగా అధికారుల తీరు
- సీట్లో కూర్చోవాలన్న నిబంధన గాలికి..
- ప్రజలకు తప్పని పాట్లు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ను అభివృద్ధి పథకంలో నడిపించాల్సిన జీహెచ్ఎంసీలో ఇప్పుడు యజమాని లేని ఇల్లు అన్న చందంగా తయారైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ సెలవుపై వెళ్లడమే ఆలస్యం.. కింది స్థాయి అధికారుల నుంచి విభాగాధిపతుల వరకు అందరూ ఆయా రామ్.. గయా రామ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అడిగే నాథుడు లేక, చెప్పే వారు లేక విధి నిర్వహణ గాలికొదిలేశారు. కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో ఎవరికీ అంతుచికడం లేదు. ఫలితంగా సమస్యల పరిషారం కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే సామాన్య పౌరులకు చుకలు కనిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలు, ట్యాక్స్ సవరణలు, దోమలు, కుకల బెడద వంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు నగరవాసులు ట్యాంక్ బండ్ కార్యాలయానికి క్యూ కడుతుంటే, వారికి కనీసం సమాధానం చెప్పే నాథుడు కరువయ్యాడు. ముఖ్యంగా సందర్శన వేళలు (మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు) కచ్చితంగా సీట్లలో ఉండాలన్న నిబంధనను అధికారులు తుంగలో తొకారు. జోనల్, సరిల్ కార్యాలయాల్లో పరిస్థితి మరీ అధ్వానం. జోనల్ కమిషనర్లు సైతం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు, మెడికల్ ఆఫీసర్లు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఫిర్యాదుదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

