పంజాగుట్ట శ్మశాన వాటికలో పనులు పూర్తి చేయండి
పంజాగుట్ట శ్మశానవాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్‌రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నె కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట శ్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో పర్యటించారు.
- బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్
సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): పంజాగుట్ట శ్మశానవాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్‌రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నె కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట శ్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో పర్యటించారు. శ్మశాన వాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఆఫీస్ గది, మిగిలిన పనులను పూర్తి చేయాలన్నారు. సింగిడికుంట నాలా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ఆదే విధంగా నాలా బాక్స్ డ్రైన్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో గల వివాదాస్పద స్థలంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణానికి అదే విధంగా తట్టిఖానా రిజర్వాయర్ సైట్ వద్ద కూడా మల్టీలెవల్ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కమిషనర్ జేవీఆర్ పార్కులో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. సింగిడికుంట, నాయుడునగర్ బస్తీల్లో నాలా మీద పైకప్పు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, ఎస్ఈ రత్నాకర్, యూబీడీ అదనపు కమిషనర్ డాక్టర్ సునంద తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

