కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి 4న జరిగే ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు.
- 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
- వివరాలను వెల్లడించిన ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్
సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ): ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి 4న జరిగే ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. శనివారం నిజాం కాలేజీలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రొనాల్డ్ రాస్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో 13 లోకేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 20 టేబుళ్లు, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
యాకత్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 24 రౌండ్లు, చార్మినార్‌లో అత్యల్పంగా 15 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మొదటి ఫలితం చార్మినార్ వచ్చే అవకాశం ఉన్నదని, మధ్యాహ్నం మూడు గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు 17 రౌండ్లు ఉంటాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నాంపల్లి, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలో మూడు చోట్ల ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, హైదరాబాద్ ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
3 చోట్ల.. మల్కాజిగిరి ఓట్ల లెక్కింపు
మేడ్చల్, జూన్1(నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4న ఉదయం 8.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానున్నది. మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో మూడు చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలకు సంబంధించి కీసర మండలం భోగారంలోని హోలీమేరీ కళాశాల, ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించి సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియం, కంటోన్మెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో నిర్వహించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

