Amrapali | సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ) : ప్రజల భాగస్వామ్యంతో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించినట్లు చెప్పారు.
సాలె పురుగులు, బొద్దింకలు..
పిర్జాదీగూడలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమరావతి హోటల్లో ఫ్రిజ్లో ఉన్న ఆహార పదార్థాలు లేబుల్స్ లేకుండా ఉండటం, ఆహారంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది. వర్కర్లు ఎలాంటి గ్లోవ్స్, హెయిర్ క్యాప్స్ ధరించలేదని తేల్చారు. పార్కు బేకర్స్లో వంటగది గోడలపై సాలె పురుగులు, బొద్దింకలు ఉండటాన్ని గుర్తించారు.