సిటీబ్యూరో, ఆగస్టు 09 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో(GHMC) వరద నీటి కాలువలలో నీరు నేరుగా పోయే విధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉన్నతాధికారులను ఆదేశించారు. నాలాలో అక్కడక్కడ నీటి నిలువతో దోమలు బ్రీడింగ్( Mosquito breeding) అవకాశం ఉన్నందున వెంటనే ఆయా ప్రాంతాలలో దోమల వ్యాప్తి చెందకుండా పూడికతీత చేపట్టాలని కమిషనర్ ఆమ్రపాలి కాట(Amrapali) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కమిషనర్ జోనల్, అడిషనల్ కమిషనర్లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.
స్మార్ట్ వాటర్ డ్రైన్, మూసీ నదిలో వరద నీరు నేరుగా వెళ్లలేకపోవడంతో స్టాగ్నేషన్ అయి దోమలు బ్రీడింగ్ ఎక్కువగా అవుతున్నాయని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. సీఆర్ఎంపీ ద్వారా చేపట్టిన బీటీ రోడ్ల నిర్వహణ త్వరలో అగ్రిమెంట్ పూర్తికావస్తున్న నేపథ్యంలో వారు ఇంకా మిగిలిన పనులు చేయలసిన వెంటనే పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు ఆదేశించారు. ఫుట్‌పాత్‌లో సెంట్రల్ మీడియన్, కర్బ్లైన్, లైన్‌మార్కింగ్ పనులను అన్ని జోనల్లో పూర్తి చేయాలని కమిషనర్ జోనల్ కమిషనర్లను కమిషనర్ ఆదేశించారు.