Amrapali | సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అడిషనల్, జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రేటర్లో శానిటేషన్ ప్రక్రియను మెరుగుపరిచి గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని శానిటేషన్ అడిషనల్ కమిషనర్‌ను ఆదేశించారు. గతంలో శానిటేషన్ మెరుగుకు తీసుకున్న చర్యలు, ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. అవసరమైతే జోనల్ కమిషనర్లు, ఎస్‌ఎస్‌డబ్ల్యూ ఇంజినీర్లతో చర్చించి తుది నివేదికను రెండు రోజుల్లో అందజేయాలని శానిటేషన్ ఏసీకి సూచించారు.