జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం
అన్నపూర్ణ భోజనం ధర పెంపును భరించనున్న బల్దియా
స్థాయి సంఘం సమావేశంలో ఆరు అంశాలకు సభ్యుల ఆమోదం
సిటీబ్యూరో, మార్చి 16 : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం ఏడవ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 వార్షిక బడ్జెట్ రూ.6150 కోట్లకు స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. అదే విధంగా స్థాయి సంఘం సమావేశంలో పలు అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మహపర, మిర్జా ముస్తఫా బేగ్, ప్రవీణ్ సుల్తానా, మందగిరి స్వామి, బతా జబీన్, ఇ.విజయ్ కుమార్ గౌడ్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, ఎం.శ్రీనివాస రావు, రావుల శేషగిరి, సామల హేమ, కుర్మ హేమలత, కమిషనర్ డీఎస్.లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్లు సంతోష్, శృతి ఓఝా, ఏసీ ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ కెనడి, జోనల్ కమిషనర్లు సామ్రాట్ అశోక్, శ్రీనివాస్ రెడ్డి, పంకజ, రవికిరణ్, వి.మమత, ప్రియాంక అలా, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, సీఈ దేవానంద్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ్ కుమార్, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఆమోదం తెలిపిన అంశాలు ఇవే..
స్టాండింగ్ కమిటీలో వార్షిక బడ్జెట్ ఆమోదం