సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ అడహక్ కమిటీ కాంట్రాక్టర్లు బుధవారం కమిషనర్ కర్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అడహక్ కమిటీ చైర్మన్ ఆర్ హనుమంత్సాగర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆరు జోన్ల పరిధిలో ఉన్న కాంట్రాక్టర్లతో ఇంజినీరింగ్, సీఎఫ్ఏ, సంబంధిత విభాగాల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం నిలిచిపోయిన బడ్జెట్ కేటాయింపులు, పెండింగ్ పేమెంట్లు, వర్క్ మేనేజ్మెంట్ సిస్టం లోపాలు, టెండర్లకు సంబంధించిన పలు అంశాలను కమిషనర్‌కు వివరించారు.