సిటీబ్యూరో, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌లు సంయుక్తంగా పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఎలాంటి పాత్ర పోషించాలనే అంశాలపై చర్చించారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రజలకు వేగంగా సేవలు అందించాల్సిన అవసరముందని అధికారులు సూచించారు. కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు పోలీసుల సహకారం అందించే అంశం గురించి వివరించా రు. పోలీసు కుటుంబాలకు చెందిన వారందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.