
బంజారాహిల్స్,ఏప్రిల్ 24: బిన్ఫ్రీ సిటీగా మార్చేందుకు ఓ వైపు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంటే..కొంతమంది యథేచ్ఛగా రోడ్లపై చెత్తను పారబోస్తున్నారు. ఇంటి వద్దకే స్వచ్ఛ ఆటోలు వస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలో పారిశుధ్య సిబ్బంది వినూత్నంగా అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. పారిశుధ్య సిబ్బంది, స్వీపర్లు, స్వచ్ఛ ఆటోల డ్రైవర్లు ఇంటింటికీ వెళ్లి చెత్తను రోడ్లపై పారవేయవద్దంటూ చేతులెత్తి మొక్కుతూ అవగాహన కల్పిస్తున్నారు. శనివారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేట డివిజన్ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి చెత్తను వేయవద్దని కోరారు.