ఇంటి గణపతులు సాగర తీరంవైపు అడుగులు వేస్తున్నాయి. చాలా మంది తమ ఇంట్లో ప్రతిష్టించుకున్న గణనాథులను హుస్సేన్ సాగర్ తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. ఆదివారం కావడంతో ట్యాంక్‌బండ్ అంతా గణనాథులతో ముచ్చటగొలిపింది. భారీగా భక్తులు తరలివచ్చి గణనాథులతో సెల్ఫీలు దిగుతూ హుషారుగా గడిపారు. నగర వ్యాప్తంగా ఉన్న నిమజ్జన కొలనులు సందడిగా మారాయి. ప్రభుత్వ శాఖల అధికారులు గణేశ్ నిమజ్జనం సవ్యంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ)