బండ్లగూడ, ఆగస్టు 16: ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వాహనం, రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం అత్తాపూర్ పిల్లర్ నంబర్ 162 వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై అనుమానం వచ్చి ఆపి.. తనిఖీ చేశారు.
వాహనంలో రెండు కిలోల గంజాయి బయటపడింది. విచారణలో తాండూరు నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, నగరంలో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు నిందితులు తెలిపారు. దీంతో వాహనం డ్రైవింగ్ చేస్తున్న షకీల్‌తో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.