సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): లక్డీకపూల్ మెట్రో స్టేషన్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్టీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో స్టేషన్ సమీపంలో తనిఖీ చేస్తుండటంతో సుబ్రహ్మణ్యం, మోసిన్ అనే వ్యక్తులు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. వారి వద్ద తనిఖీలు నిర్వహించి 1.223 కిలోల గంజాయి లభించడంతో అరెస్ట్ చేసి లక్డీకపూల్‌లోని ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు.
పటాన్చెరువు బీహెచ్ఈఎల్ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న కిశోర్ అనే వ్యక్తిని ఎస్టీఎఫ్ బీ టీమ్ ఎస్ఐ బాలరాజు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 233 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.